Privacy Policy — GP Data Collection

గోప్యతా విధానం • Last updated / చివరి అప్‌డేట్: 04/10/2026

గోప్యతా విధానం (Privacy Policy) — GP Data Collection

చివరి అప్‌డేట్: 04/10/2026 • యాప్: GP Data Collection (గ్రామ పంచాయతీ డేటా కలెక్షన్)

ఒక్క లైన్‌లో: ఈ యాప్ గ్రామ పంచాయతీ అధికారుల (State Admin, జిల్లా/మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శి) కోసం మాత్రమే. ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హత నిర్ధారణకు గృహ సర్వే వివరాలను సేకరించడానికి, గ్రామ పంచాయతీ జమా ఖర్చుల ఖాతాలను (క్యాష్ బుక్) నిర్వహించడానికి ఉపయోగిస్తారు. ఇది సాధారణ ప్రజల కోసం కాదు, ఇందులో ప్రకటనలు లేవు, మేము మీ సమాచారాన్ని అమ్మం, ఎవరితోనూ పంచుకోం.

1. మేము సేకరించే సమాచారం

అధికారం పొందిన పంచాయతీ అధికారులు, కుటుంబం అనుమతితో, ఈ వివరాలను నమోదు చేస్తారు:

  • ఇంటి వివరాలు: ఇంటి నంబర్, యజమాని పేరు, భవన వినియోగం/నిర్మాణం, పన్ను, విద్యుత్/నీరు/పారిశుధ్య కనెక్షన్లు, భూమి కొలతలు.
  • కుటుంబ వివరాలు: రేషన్ కార్డ్, పట్టాదార్ పాస్ బుక్, జాబ్ కార్డ్, గ్యాస్ కనెక్షన్, మొబైల్ నంబర్, భూమి కలిగి ఉన్న వివరాలు.
  • వ్యక్తిగత వివరాలు (ఒక్కో సభ్యునికి): పేరు, వయస్సు, లింగం, కులం, విద్య, వృత్తి, ఆధార్ నంబర్ (ఐచ్ఛికం), ఓటర్ ఐడి (ఐచ్ఛికం), పెన్షన్ స్థితి.
  • అధికారిక లాగిన్ వివరాలు: మొబైల్ నంబర్ (username గా), OTP ధృవీకరణ. పాస్‌వర్డ్‌లు ఎక్కడా నిల్వ చేయం.
  • గ్రామ పంచాయతీ క్యాష్ బుక్ వివరాలు: పంచాయతీ జమలు మరియు ఖర్చులు (తేదీ, రసీదు/వోచర్ నంబర్, మొత్తం, నిధి రకం, ఖర్చు రకం, చెల్లింపు వివరాలు, చెక్కు నంబర్), సర్పంచ్ / ఉప సర్పంచ్ పేర్లు, ఆ సంవత్సరంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శుల పేర్లు మరియు వారు పనిచేసిన తేదీలు. "చెల్లింపు వివరాలు" లో చెల్లింపు అందుకున్న వ్యక్తి లేదా సంస్థ పేరు ఉండవచ్చు.

2. మీ సమాచారం ఎక్కడ నిల్వ ఉంటుంది

  • గృహ సర్వే సమాచారం (కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్, భూమి వివరాలు మొదలైనవి) అధికారి ఫోన్‌లోనే SQLCipher (AES-256) encryption తో నిల్వ ఉంటుంది. ఇది మా సర్వర్‌లకు ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ కాదు.
  • క్యాష్ బుక్ సమాచారం (జమలు, ఖర్చులు, మొత్తాలు, వోచర్ వివరాలు, సర్పంచ్ మరియు కార్యదర్శుల పేర్లు) కూడా అధికారి ఫోన్‌లోనే, ప్రత్యేక encrypted డేటాబేస్‌లో (AES-256) నిల్వ ఉంటుంది. ఈ మొత్తాలు, వివరాలు మా సర్వర్‌లకు లేదా క్లౌడ్‌కు పంపబడవు.
  • మొబైల్ నంబర్/OTP ధృవీకరణ కోసం Google Firebase Authentication వాడతాం. ఇది కేవలం "ఈ మొబైల్ నంబర్ నిజమైనదే" అని నిర్ధారించడానికే.
  • అధికారుల మ్యాపింగ్ వివరాలు (ఏ అధికారి ఏ జిల్లా/మండలం/గ్రామ పంచాయతీకి బాధ్యులు, వారి మొబైల్ నంబర్‌తో సహా), డేటా ఎంట్రీ Freeze/Unfreeze స్థితి, మరియు క్యాష్ బుక్ నెలల Freeze/Unfreeze స్థితి (గ్రామ పంచాయతీ పేరు, ఆర్థిక సంవత్సరం, ఏ క్యాష్ బుక్, ఏ నెల, Freeze అయిందా లేదా, మార్చిన సమయం, మార్చిన అధికారి మొబైల్ నంబర్) Google Cloud Firestore (భారతదేశం, ముంబై డేటా సెంటర్) లో నిల్వ ఉంటాయి. దీనివల్ల ఒక అధికారి చేసిన మార్పు ఇతర అధికారుల ఫోన్‌లలో సరిగ్గా కనిపిస్తుంది. ఈ సమాచారంలో ప్రజల (లబ్ధిదారుల) వ్యక్తిగత వివరాలు గానీ, క్యాష్ బుక్ మొత్తాలు గానీ ఉండవు. ఇది కేవలం పరిపాలనా నిర్మాణం మరియు Freeze స్థితి మాత్రమే.
  • అధికారి తనంతట తానే Export/Share చేస్తేనే (PDF/Word/Excel రూపంలో) ఫైల్ ఫోన్ నుండి బయటకు వెళ్తుంది. క్యాష్ బుక్ PDF కూడా అంతే. ఇది అధికారి స్వంత నిర్ణయం, యాప్ ఎప్పుడూ ఆటోమేటిక్‌గా చేయదు.

3. సేకరణ ఉద్దేశం

  • ప్రభుత్వ సంక్షేమ పథకాల (పెన్షన్లు, గృహ నిర్మాణం, త్రాగునీరు, పారిశుధ్యం మొదలైనవి) నిజమైన లబ్ధిదారులను గుర్తించడం.
  • గ్రామ పంచాయతీ స్థాయిలో పరిపాలనా రికార్డులు నిర్వహించడం.
  • నకిలీ/అనర్హ లబ్ధిదారుల ఎంపికను నివారించడం.
  • గ్రామ పంచాయతీ నిధుల జమా ఖర్చుల ఖాతాలను (క్యాష్ బుక్) నిబంధనల ప్రకారం నిర్వహించి, నెలవారీ నివేదికలు తయారుచేయడం.

ఈ సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాలకు, ప్రకటనలకు, లేదా మూడవ పక్ష వాణిజ్య అవసరాలకు ఉపయోగించం.

4. ఎవరు ఈ సమాచారాన్ని చూడగలరు

యాప్‌లో నాలుగు స్థాయిల అధికారిక లాగిన్ ఉంది (State Admin → జిల్లా → మండలం → పంచాయతీ కార్యదర్శి). ప్రతి స్థాయి తన పరిధిలోని సమాచారాన్ని మాత్రమే చూడగలదు. Export/Download అనుమతి కూడా నిర్దిష్ట స్థాయిలకే పరిమితం. క్యాష్ బుక్ మొత్తాలు, ఎంట్రీలు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫోన్‌లోనే ఉంటాయి. మండల (MPO) మరియు జిల్లా (DPO) అధికారులు క్యాష్ బుక్ నెలల Freeze స్థితిని మాత్రమే చూడగలరు మరియు Unfreeze చేయగలరు, మొత్తాలను చూడలేరు.

5. మీ హక్కులు

మీ కుటుంబ వివరాలు ఈ సర్వేలో నమోదు అయ్యాయని భావించి, వాటిని సరిచేయాలన్నా లేదా తొలగించాలన్నా, మీ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించవచ్చు, లేదా కింద ఇచ్చిన సంప్రదింపు వివరాల ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

6. పిల్లలు

ఈ యాప్ పిల్లల కోసం ఉద్దేశించినది కాదు, ఇది ప్రభుత్వ అధికారుల అంతర్గత వినియోగం కోసం మాత్రమే. అయితే గృహ సర్వేలో భాగంగా కుటుంబంలోని మైనర్ సభ్యుల ప్రాథమిక గణాంక వివరాలు (పేరు, వయస్సు, విద్య మొదలైనవి, తల్లిదండ్రుల అనుమతితో) పరిపాలనా అవసరాల కోసం నమోదు చేయవచ్చు.

7. ఈ విధానంలో మార్పులు

ఈ గోప్యతా విధానం అప్పుడప్పుడు అప్‌డేట్ కావచ్చు. మార్పులు ఇదే పేజీలో ప్రచురిస్తాం.

సంప్రదింపు వివరాలు:
Burrola Murali
Email: burrolamurali@gmail.com
Phone: +91 9704068087